గలగల పరవళ్ళు తొక్కుతూ కుప్పం గడ్డపై పారుతున్న కృష్ణా జలాలు

* కుప్పానికి కృష్ణమ్మ జలాలు- రైతుల్లో తీరిన కరవు భయం. * హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు. * నేడు జలహారతి నిర్వహించనున్న సీఎం చంద్రబాబు. కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్):కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో కుప్పం ప్రాంత రైతులు, ప్రజలు ఆనందపరవశులవుతున్నారు. శ్రీశైలం నుండి కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాలు దాటుకుంటూ హంద్రీనీవా కాలువ ద్వారా వస్తున్న నీటిని చూసి రైతులు ప్రజలు మురిసిపోతున్నారు. కాలువ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతున్న...