పలమనేరు, ఆగష్టు 02 ( గరుడ ధాత్రి ) :
పట్టణ గాండ్ల కులస్థులచే అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా తమ కులస్తులు కులదైవమైన శ్రీ మునేశ్వర స్వామి పూజలు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు.గాండ్ల కులస్థులు తమ పూర్వీకుల నుంచి ఈ దైవ కార్యాన్ని జరుపుతున్న పట్టణ సమీపంలోని గోరితోపు ప్రక్కన శ్రీ మునేశ్వర స్వామి దేవాలయం వద్ద స్వామిని ప్రసిద్ధ బoకమట్టితో కళాకారుల ద్వారా అందంగా తీర్చి ప్రత్యేక పూజా విధానంతో కులస్థులు మూకుమ్మడిగా మొక్కులు తీర్చుకొన్నారు.అంతకు మునుపు పట్టణ పుర వీధుల గుండా పంబ వాయిద్యాలు నడుమ ఊరేగింపును కొనసాగించారు. వరుసగా మూడవ ఏడాది ఈ పూజలు జరుపుకోవడంతో పలమనేరు పట్టణ, పలమనేరు నియోజకవర్గంతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాoతం నుంచి కూడా కులస్థులు హాజరయ్యారు. ముందురోజు శనివారం నుంచి మునేశ్వర దేవాలయ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ధారు.ఏడాదికి ఓ సారి జరుపుకొనే ప్రత్యేక మహోత్సవం కనుక ప్రత్యేక కమిటీ సభ్యులు రెండు వారాలు పాటు కులస్థులను కలుస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి శ్రమించారు.రానున్న రోజులలోనూ ఈ దైవ కార్యక్రమాలు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు తెలియజేసారు. ఇందులో సుమారు 1500 మంది కులస్థులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.ఈ కార్యక్రమంలో కుల పెద్దలు బి.చంద్ర అనే బాలకృష్ణ,ఆర్.రాజేంద్రన్,ఆర్. అమరేంద్ర బాబు, టి. కె. షణ్ముగం ఆధ్వర్యంలో జరుగగా కార్యనిర్వాహకులుగా ఎ.గణేష్, కోదండరామ్మయ్య,ఎ.ఆర్. కుమార్, ఆకుల కృష్ణమూర్తి, ప్రకాష్ బాబు,కె.వి.శ్రీనాధ్,పి.ఎస్.కృష్ణమూర్తి,బాలసుబ్రమణ్యo,పళని,కె.ఎస్. రాజేష్,ఆర్.కె.రవి,కె.కేశవులు వ్యవహరించారు.