గాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమం

విద్య, ఓపెన్ స్కూల్ ప్రాముఖ్యతపై అవగాహన – ఋతుక్రమ ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ పిచ్చాటూరు, మే 29 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు గాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు బజావతి, సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెషన్-9గా “విద్య మరియు ఓపెన్ స్కూల్ యొక్క ప్రాముఖ్యత”తో పాటు “ఋతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రత దినోత్సవం”పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పిచ్చాటూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...