GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 5:14 pm Digital Edition : GURU SWAMY

గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పిచ్చాటూరు అక్టోబర్ 2 గరుడధాత్రి :

గాంధీ జయంతిని పురస్కరించుకుని పిచ్చాటూరు మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మహమ్మద్ రఫీ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది కూడా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను స్మరించుకున్నారు.