GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 7:15 pm Posted by : GARUDA DHATRI NEWS

గాలి వర్షానికి ఐదు విద్యుత్ స్తంభాలు నేలమట్టం – గ్రామంలో విద్యుత్ అంతరాయం

గరుడధాత్రి :
తిరుపతి జిల్లా కార్వేటినగరం మండలం ఆర్కే వీబీపేట పంచాయతీ పరిధిలోని రాజులకండిగ గ్రామానికి వెళ్లే రహదారి మార్గంలో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన ఐదు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి.
దీంతో రాజులకండిగ గ్రామంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అలాగే ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లినట్లు స్థానికులు పేర్కొన్నారు.