GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 6:18 pm Digital Edition : GURU SWAMY

గిరిజనులకు ఇంటిపట్టాలు ఇప్పించండి – తహసిల్దార్ కు వినతి

కంచరపాలెం మాజీ సర్పంచ్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దశరథన్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు గిరిజనులు వినతి
ఇంటిపట్టాల కోసం పదేళ్లుగా పోరాడుతున్నాం.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాం. అధికారులకు మొర పెట్టుకుంటూనే ఉన్నాం..అధికారులు మారుతున్నారు తప్ప మాకు ఇంటిస్థలాలు మాత్రం మంజూరు చేయడం లేదు. ఇప్పటికైనా కరుణించి ఇంటిస్థలాలు ఇప్పించండయ్యా అంటూ కంచరపాలెం గిరిజనులు మాజీ సర్పంచ్ టీడీపీ మండల ప్రధానకార్యదర్శి దశరథన్ ఆధ్వర్యంలో తహశీల్దార్ సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందించారు..
సోమవారం వరదయ్యపాలెం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో గిరిజనులు ఈ మేరకు తహశీల్దార్ సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఇంటిపట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం ద్వారా పక్కాఇళ్లు మంజూరు కాకపోవడంతో పూరిగుడిసెల్లో నివాసం ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తహశీల్దార్ సుధీర్ రెడ్డి స్పందిస్తూ గిరిజనుల ఆధార్ కార్డులు ఇంటిపన్ను, కరెంట్ బిల్లు రసీదులతో సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఇంటిపట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.