గుంటూరు జిల్లా బీజేవైఎం ఇన్‌చార్జిగా ఉమా మహేష్ నియామకం

పలమనేరు, ఆగస్టు 10 ( గరుడ ధాత్రి ) : పలమనేరు నియోజకవర్గం గంగవరం గ్రామానికి చెందిన యువ నాయకుడు ఉమా మహేష్ కు గుంటూరు జిల్లా బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు దక్కాయి. విద్యార్థి దశ నుంచే జాతీయవాద భావజాలంతో ప్రజా, యువత సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఉమా మహేష్ సుమారు 13 ఏళ్ల పాటు ఏబీవీపీ లో క్రియాశీలకంగా పనిచేశారు. శ్రీ వెంకటేశ్వర...