GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 6:33 am Digital Edition : GURU SWAMY

గుండెపోటుతో ఇంటెలిజెన్స్ డిఎస్పి శ్రీరామ్ మృతి

ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ డిఎస్పి శ్రీరామ్ గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన శ్రీరామ్ ను తోటి ఉద్యోగులు ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందారు. గతంలో గిద్దలూరు, పొదిలి, కందుకూరు, అద్దంకి, చీరాల ప్రాంతాలలో శ్రీరామ్ సీఐ గా పని చేసి తనకంటూ ప్రత్యేక మార్కు వేసుకున్న శ్రీరామ్ ఎన్నో క్లిష్టతరమైన క్రైమ్ కేసులను ఛేదించారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ తోటి ఉద్యోగులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంతాపం తెలిపారు.