గుండెపోటుతో వీఆర్ఏ ఈశ్వర్ మృతి

గుండెపోటుతో వీఆర్ఏ ఈశ్వర్ మృతి కుటుంబంలో విషాదం.. ప్రభుత్వ సహాయం కోరుతున్న బంధువులు పిచ్చాటూరు మే 22 గరుడధాత్రి న్యూస్ : పిచ్చాటూరు మండలంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం విధులు ముగించుకుని నాగలాపురం మండలం వినోబా నగర్‌లోని తన నివాసానికి చేరుకున్న ఈశ్వర్, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు...