GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:42 am Digital Edition : GURU SWAMY

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి

చౌడేపల్లి సెప్టెంబర్ 15 గరుడ దాత్రి న్యూస్

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి చెందిన సంఘటన మంగళవారం చౌడేపల్లిలో చోటుచేసుకుంది చౌడేపల్లి సంత గేటుకు చెందిన ఇక్కలూరి రాజేష్ 42 ప్రజాశక్తిలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు గత కొంతకాలంగా ఆయన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు ఈ క్రమంలో ఉదయం ఇంట్లో ఉండగా ఛాతిలో నొప్పి రావడంతో ఉన్నట్టుండి అక్కడే కుప్పకూలి మృతి చెందాడు మృతునికి అనారోగ్యం తో ఉన్న తండ్రి తల్లి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మరణ వార్త వినగానే ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు సంయుక్తంగా తరలివచ్చి కుటుంబ సభ్యులకు రూ 50వేలు అందించారు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో దహనక్రియలను అత్యంత వైభవంగా నిర్వహించారు