* గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు.
* జోరుగా కొనసాగుతున్న టిడిపి పంచాయతీ సర్వసభ్య సమావేశాలు.
కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి న్యూస్): గుడిపల్లి మండల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని గుడుపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కుప్పం శాసనసభ్యులు తారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గుడిపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ పంచాయతీ సర్వసభ్య సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని పొగరుపల్లి, దసామానిపల్లి గ్రామపంచాయతీలలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశాలను సోమవారం నిర్వహించారు . ఈ సమావేశాలలో నాయకులు మాట్లాడుతూ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సమిష్టిగా కృషిచేసి అన్నింటా విజయం సాధించాలన్నారు. అదేవిధంగా పొగురుపల్లి పంచాయతీలలో రైతులకు ఉలవలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యస్ సుబ్రమణి (సుబ్బు), నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఆర్. చంద్రశేఖర్, కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ జి యం రాజు, కాస్టర్ ఇన్చార్జి లు, మాజీ జెడ్పిటిసి బేటప్ప నాయుడు, బాలాజీ, చైర్మన్ రమేష్, మాజీ అధ్యక్షలు హేమాంబర్ గౌడ్, మాజీ సర్పంచ్ గోపాల్, అగరం పంచాయతీ అధ్యక్షులు సురేష్, పొగురుపల్లి యూనిట్ ఇంచార్జ్ గోవిందస్వామి, నియోజకవర్గ సెల్ అధ్యక్షలు ఎల్లప్ప, మండల జనరల్ సెక్రెటరీ వి. సురేష్ మండల మహిళా అధ్యక్షురాలు సుందరమ్మ, యూనిట్ ఇంచార్జ్లు,బాలచంద్రా, అమరేష్, రమేష్,మరియు భాను మూర్తి, పద్మమ్మ, అమరమ్మ, ఐటిడిపి మండల అధ్యక్షులు రాజేంద్ర తదితరాలు పాల్గొన్నారు.