గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల

తిరుమల, 2026 సెప్టెంబరు 19 గరుడధాత్రి : గరుడ వాహనంపై వైభవంగా శ్రీమలయప్పస్వామి – కనులారా వీక్షించిన లక్షలాది భక్తులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ శనివారం రాత్రి తిరుమలలో భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. స్వర్ణ గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనం రాగానే మార్మోగిన గోవింద నామం సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన మండపం నుంచి స్వర్ణ గరుడ వాహనంపై స్వామివారు వెలుపలకు రాగానే నాలుగు మాడ వీధుల్లోని...