గోవింద నామస్మరణల మధ్య ప్రారంభమైన శ్రీనివాసమంగాపురం వసంతోత్సవాలు
గోవింద నామస్మరణల మధ్య ప్రారంభమైన శ్రీనివాసమంగాపురం వసంతోత్సవాలు మే 08న కనులపండువగా స్వర్ణ రథోత్సవం సాక్షాత్తు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిరూపంగా భక్తుల అర్చనలు అందుకుంటున్న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలతో, మంగళవాయిద్యాల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వసంత ఋతువులో ప్రకృతి ప్రసాదించిన పుష్పాలు, ఫలములను స్వామివారికి సమర్పించి కలియుగ వైకుంఠ వాసుడు శ్రీనివాసుని అనుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారు. భక్తుల హృదయాలలో...