GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:00 am Digital Edition : GURU SWAMY

గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

పలమనేరు, ఆగస్టు 13 ( గరుడ ధాత్రి ) :
స్వాతంత్ర్య సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గీత కార్మికుల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి ఉత్సవాలకు విచ్చేయాలని జిల్లా ఈడిగ గౌడ్ సంఘం నాయకులు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని ఆహ్వానించారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఆ సంఘ నాయకులు ఎమ్మెల్యేను కలసి ఆహ్వానించారు. ఈ నెల 16న జిల్లా కేంద్రమైన చిత్తూరులోని కట్టమంచి నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించనున్న శాంతి ర్యాలీలో పాల్గొనాలని ఆయన్ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈడిగ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్, ఉపాధ్యక్షులు జనార్దన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గోపి గౌడ్ మరియు చిత్తూరు పార్లమెంట్ టిడిపి ఈడిగ బిసి సాధికారక సమితి నాయకులు బుసా నాగరాజు గౌడు,మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ గౌడ్, ఉమాపతి, పవన్ గౌడు, కిషోర్, వంశీ తదితరులున్నారు.