గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన ఎస్ఐ సునీల్
నాగలాపురం పట్టణంలోని సన్నిధి వీధిలో ఎస్ఐ సునీల్ గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గంజాయి, సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డయల్-112 సేవలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.