GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:38 am Digital Edition : GURU SWAMY

గ్రామాలలో అక్రమంగా మట్టి తరలించిన వారిపై కఠిన చర్యలు తహశీల్దార్ నాగరాజు

కార్వేటి నగరం సెప్టెంబర్ 21 గరుడ దాద్రి న్యూస్
కార్వేటి నగరం మండలంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో చెరువులు మరియు గుట్టల్లో అక్రమంగా మట్టి మరియుగ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ నాగరాజు హెచ్చరించారు. సోమవారం కార్వేటి నగరం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు వీఆర్ఏలు సర్వేయర్లతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతర సెలవుల రోజుల్లోనే చెరువుల్లో గుట్టల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు.వాటిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.అక్రమంగా ఏదైనా తరలిస్తుంటే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.సెలవు రోజుల్లో సైతం వీఆర్ఏలు వారికి సంబంధించిన ప్రదేశాల గ్రామాలకు వెళ్లి నోట్ కెమెరాలు ఫోటోలు తీసి గ్రూప్లో తప్పనిసరిగా షేర్ చేయాలన్నారు.చెరువులైతే ఇరిగేషన్ అధికారులకు అడవులైతే ఫారెస్ట్ అధికారులకు సైతం తెలియజేసి వారితో పాటు ఇద్దరు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మట్టి అక్రమ దారులపై చర్యలు గైకొనడం జరుగుతుందని ఇందుకు తమ సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి అక్రమంగా మట్టి రవాణా కాకుండా తగు నివారణ చర్యలు చేపట్టాలన్నారు.అలాగే పి జి ఆర్ ఎస్ ఏపీ సేవ మీ సేవలకు సంబంధించిన ఒక సర్టిఫికెట్ కూడా గడువుకు ముందే రిపోర్టులు అందజేసి పూర్తి చేయాలన్నారు.ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు సాయంకాల మూడు గంటల నుండి 5 గంటల వరకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి స్థానికంగా వచ్చే అర్జీదారుల నుండి అర్జీలు తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా ఇక్కడే వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార