GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 10:55 am Digital Edition : GURU SWAMY

గ్రామ పంచాయతీల ద్వారానే ఉపాధి పనులు- ఎంపీడీవో మహమ్మద్ రఫీ

గరుడధాత్రి న్యూస్ :
పిచ్చాటూరు మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు శనివారం ఎంపీపీ రేఖా హరిచంద్ర రెడ్డి వారి అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగినది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ఇకపై గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలోనే ఉపాధి పనులు జరుగుతాయని తెలిపారు. సభకు 9 మంది ఎంపీటీసీలు ఉండగా ఆరుగురు మరియు ఒక కో ఆప్షన్ మెంబర్ హాజరయ్యారు మాత్రం హాజరయ్యారు, రెవిన్యూ కు సంబంధించిన ప్రజలు రైతులు సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తూ ఉన్నామని తాసిల్దార్ వై చంద్రబాబు నాయుడు తెలిపారు,ప్రభుత్వ పాఠశాల యందు ఈ సంవత్సరం విద్యార్థులు మెరుగ్గా చేరారని ఎంఈఓ 2 యుగంధర్ రాజు తెలిపారు, పశువులకు దాన ఉచితంగా టీకాలు పాడి రైతులకు అందిస్తున్నామని వెటర్నరీ డాక్టర్ మంజుల తెలిపారు, పీహెచ్సీలో ప్రజలకు కావలసిన వైద్య సదుపాయాలు అన్ని అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ధనుష్ తెలిపారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్, ఏపీఎం, ఏపీఓ, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.