గ్రామ పరిశుభ్రతపై కళాజాత కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమం
ఎంపీడీఓ ఆనందబాబు బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు7 బైరెడ్డిపల్లి మండలంలోని గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ ఆనందబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రతిరోజూ రెండు నుంచి మూడు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు, విద్యార్థులకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి ఇవ్వాలని, రోడ్లపై, కాలువల్లో, ఖాళీ స్థలాల్లో చెత్తను వేయకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల...