GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:43 am Digital Edition : GURU SWAMY

గ్రామ రెవిన్యూ సహాయకులు నిరసన

గరుడధాత్రి న్యూస్ డక్కిలి 23-9-2026:

తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో గ్రామ రెవిన్యూ సహాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన వ్యక్తంచేశారు. అనంతరం డక్కిలి తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.దీనికి నేతృత్వం వహించిన సి ఐ టి యు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేపల్లి చంగయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సేవలు అందించడంలో విఆర్ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని వీరికి గౌరవ వేతనం, పదోన్నతులు, సర్వీసు క్రమబద్ధీకరణ సంబంధిత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచెయ్యాలని, సీనియారిటీని బట్టి అర్హులు అయినా వారికి ప్రమోషన్లు ఇవ్వాలని వి ఆర్ ఎ లు కోరారు. ఈ కార్యక్రమంలో మండలం పనిచేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులు గోను విజయ్ కుమార్, పొట్లూరు శ్రీనివాసులు,
నావూరు పెంచలనరసయ్య, మచ్చల పార్వతి, మల్లరపు పెంచలయ్య, మోదిబోయిన అమరేంద్ర, కనూరు చలమయ్య, భారతల సుబ్బమ్మ, కొండేపాక మునేంద్ర,రాపురు వెంకటేశ్వర్లు, దంట్ల గురవమ్మ, వెంకటరమణయ్య,సంక్రాంతి వెంకటకృష్ణయ్య, రాపురు అంకమ్మ పాల్గొన్నారు.