గ్రామ రెవిన్యూ సహాయకులు నిరసన
గరుడధాత్రి న్యూస్ డక్కిలి 23-9-2026: తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో గ్రామ రెవిన్యూ సహాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన వ్యక్తంచేశారు. అనంతరం డక్కిలి తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.దీనికి నేతృత్వం వహించిన సి ఐ టి యు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేపల్లి చంగయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సేవలు అందించడంలో విఆర్ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని వీరికి గౌరవ వేతనం, పదోన్నతులు, సర్వీసు క్రమబద్ధీకరణ సంబంధిత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని...