GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 10:25 pm Posted by : GARUDA DHATRI NEWS

గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోండి- ఎమ్మెల్యే ఆదిమూలం

నారాయణవనం జూన్ 14 (గరుడధాత్రి న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్ డే ను 15వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు నారాయణవనంఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతులు, ప్రజలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఏదైనా ఉంటే గ్రీవెన్స్ డే లో తెలియజేస్తే తప్పకుండా పరిష్కారం జరుగుతుందని తెలిపారుఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పంచాయతీరాజ్ డిఇఇ , హౌసింగ్ డిఇఇ విద్యుత్ శాఖ డీఇఇ , ఆర్ బ్ల్యూఎస్ డీఇఇ అన్ని శాఖలకు సంబంధించిన ఏఈలు ఎంపీడీవో నారాయణవనం కీళగరం పంచాయతీల కార్యదర్శులలో పాటు సచివాలయం ఉద్యోగులు, ఎంపీపీ జడ్పిటిసి ఎంపిటిసి సభ్యులు, మాజీ సర్పంచులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు , నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని కోరారు.

– కీళగరం లే అవుట్ ను పరిశీలించునున్న సత్యవేడు ఎమ్మెల్యే
మండలంలోని కీళగరం లేఔట్ ను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం ఉదయం నారాయణవనం ఎంపీడీవో కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే లో పాల్గొన్న తర్వాత కీళగరం లేఔట్ 10:30 గంటలకు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.కావున అందరు అధికారులు కూటమి ప్రభుత్వం, నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొనాలని కోరారు.