ఘనంగా ‘అంగన్‌వాడీ ఉత్సవం’

చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడ దాత్రి న్యూస్ స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో 'అంగన్‌వాడీ ఉత్సవం' కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గర్భిణులు, బాలింతలు మరియు పిల్లలకు అందిస్తున్న సేవలు, పోషకాహార పంపిణీ వివరాలను అంగన్‌వాడీ సిబ్బంది వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1, 3వ శుక్రవారాల్లో ఇంటికి రేషన్ కింద 3 కేజీల బియ్యం, 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు,...