GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 12:21 pm Digital Edition : GURU SWAMY

ఘనంగా ఓం శక్తి అమ్మవారి ఆడి పూజలు

బంగారుపాళ్యం ఆగస్టు 12 (గరుడ దాత్రి న్యూస్)

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కె.ఎం.కండిగ పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో వెలసిన ఓం శక్తి అమ్మవారి ఆలయంలో మంగళవారం నుండి ఆదివారం వరకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆడి పూజలను భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు,కుంకుమార్చనలు,మంగళ హారతులు నిర్వహించారు.మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది.ఈ ఐదు రోజులు ఆలయం వద్ద భజనలు,వీధి నాటకాలు,అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.