GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 4:51 pm Digital Edition : GURU SWAMY

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పలమనేరు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి ‘స్వచ్ఛ’ అవార్డు

పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి )

స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, పురపాలక, మెప్మా సిబ్బంది.. జాతిపిత చిత్రపటానికి, అలాగే బాపూజీ ఉద్యానవనంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ మొహిద్దీన్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాల్లో నడవాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నాయకత్వంలో పలమనేరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ మున్సిపాలిటీస్ 2026” అవార్డ్స్‌లో పలమనేరు పురపాలక సంఘం వరుసగా ఈ ఏడాది కూడా రాష్ట్ర స్థాయి అవార్డును దక్కించుకోవడం విశేషం. శుక్రవారం విజయవాడలో జరుగుతున్న అవార్డు ప్రదానోత్సవంలో మున్సిపల్ కమిషనర్ కె. లోకేశ్వర వర్మ పురపాలక సంఘం తరపున ఈ అవార్డును స్వీకరిస్తారని తెలిపారు.

మొక్కలు నాటే కార్యక్రమం & ప్రతిజ్ఞ:

“స్వచ్ఛత హీ సేవ”, “ఏక్ పేడ్ – మా కే నామ్” (తల్లి పేరుతో ఒక మొక్క) కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. అనంతరం పట్టణ పరిశుభ్రతపై సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ వేడుకల్లో కురబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడు, మాజీ కౌన్సిలర్ కృష్ణమూర్తి గౌడ్, గణేష్, nagaraja మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, మెప్మా ఆర్పీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.