ఘనంగా నల్లారి సోదరుల జన్మదిన వేడుకలు

చౌడేపల్లి సెప్టెంబర్ 13 గరుడ దాత్రి న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల జన్మదిన వేడుకలు పుంగనూరు నియోజకవర్గంలో ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ బోయకొండ దేవస్థానం చైర్మన్ ఎస్.కె. వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు మాదిరాజు లక్ష్మణరాజు, పతిరాజుల మార్గదర్శకత్వంలో చౌడేపల్లి బస్టాండ్ ఆవరణలో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులు, పేదలు మరియు స్థానికులకు...