GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 2:12 pm Digital Edition : GURU SWAMY

ఘనంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం

సత్యవేడు, జూలై 2 గరుడధాత్రి : సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం, ఐక్యూఏసి సంయుక్త ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు. నరసింహులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఓ. హరి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ లక్ష్యాలను వివరించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కళాశాల ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. హరి ప్రసాద్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమం ముగింపులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎం. హరి ప్రసాద్, ఎం. మురళీమోహన్, ఎస్. రవిశంకర్, ఎం. వెంకటేశ్వర్లు, ఏ. సుధాకర్, ఎం. ఢిల్లీ ప్రసాద్, వి.ఎస్.ఎం. భాషా, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.