ఘనంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం

సత్యవేడు, జూలై 2 గరుడధాత్రి : సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం, ఐక్యూఏసి సంయుక్త ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు. నరసింహులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఓ. హరి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం...