పలమనేరు, సెప్టెంబర్ 18 ( గరుడ ధాత్రి ) :
రాష్ట్ర మేదర సంఘం అధ్యక్షులు జొరిగే మస్తాన్ రావు ఆదేశాల మేరకు, చిత్తూరు జిల్లా మేదర సంఘం అధ్యక్షులు వూటుకోట వెంకటరమణ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో శుక్రవారం ‘ప్రపంచ వెదురు దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేదర సంఘం సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా మేదర సంఘం మాజీ అధ్యక్షులు పోలేపల్లి సుబ్రహ్మణ్యం, జిల్లా గౌరవాధ్యక్షులు బి. చంద్రప్ప హాజరయ్యారు. వారితో పాటు రాష్ట్ర మేదర సంఘం అధ్యక్షురాలు తమ్మినేని నారాయణమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మల్లిక, చిత్తూరు జిల్లా మేదర సంఘం అధ్యక్షుడు వూటుకోట వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్. శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే పలమనేరు టౌన్ మేదర సంఘం గౌరవాధ్యక్షులు మునుస్వామి, అధ్యక్షుడు శ్రీనివాసులు, సెక్రటరీ రామచంద్ర, నాయకులు టి. వెంకటేష్, జె. వెంకటేష్, కనికరం శివ తదితర మేదర సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.