ముత్యాలమ్మ కొలుపు సందర్భంగా మెడికల్ క్యాంప్ -అన్నదాన కార్యక్రమం
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పరిధిలోని కీలపూడి గ్రామం లో ముత్యాలమ్మ కొలుపులు పాల పద్మనాభం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల పద్మనాభం మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే కొలుపులో భాగంగా మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు తెలిపారు.
మెడికల్ క్యాంప్ నిర్వహణ
ముత్యాలమ్మ కొలుపు సందర్భంగా ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ వి. దివ్య (సీనియర్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరు) ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. క్యాంప్‌కు వచ్చిన రోగులను పరీక్షించి అవసరమైన వైద్యం అందించడంతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు.
అలాగే మధ్యాహ్నం గ్రామస్తులు, భక్తులకు పాల పద్మనాభం చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.