ఘనంగా ముత్యాలమ్మ కొలుపు ఉత్సవాలు
ప్రత్యేక పూజలు.. ఉచిత వైద్య శిబిరం.. అన్నదాన కార్యక్రమం ------- మండలంలోని కీలపూడి గ్రామంలో శుక్రవారం ముత్యాలమ్మ కొలుపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ దివ్య క్యాంపుకు విచ్చేసిన రోగులకు...