రోడ్డు విస్తరణలో తొలగించిన ఆలయాన్ని పునర్నిర్మించిన –ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు జూలై 30 (గరుడ దాత్రి న్యూస్)చిత్తూరునగర పాలక పరిధిలో కట్టమంచి – సాంబయ్య కండిగ బైపాస్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లోభాగంగాతొలగించిన అమ్మవారి ఆలయాన్ని మరో చోట నిర్మించి ఘనంగా కుంభాభిషేకం నిర్వహించారు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. చిత్తూరు 5వ వార్డు పరిధిలో స్వర్ణ వార్డు సచివాలయం వద్ద నిర్మించిన శ్రీ శక్తి మారియమ్మ ఆలయ మహా కుంభాభిషేక వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి స్థానిక నాయకులు, ప్రజలు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజలకు మంచి జరగాలని ఉద్దేశంతో ఆలయాన్ని పునర్ నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మంచి జరిగే పనులు చేయడంలో ముందుంటామన్నారు. రహదారి విస్తరణకు సహకరించిన స్థానిక ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని స్థానిక నాయకులు, ప్రజలుఘనంగాసత్కరించారు ఈ .కార్యక్రమంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కూటమి నాయకులు సీకే లావణ్య, రాజేష్ కుమార్ రెడ్డి, గోపాల్, నరేష్, పచ్చయప్ప, అనురాధ, భువనేశ్వరి, డివిజన్, బూత్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.