ఘనంగా శ్రీ కృష్ణాష్టమి సంబరాలు

పలమనేరు, సెప్టెంబర్ 04 ( గరుడ ధాత్రి ) : శ్రీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని స్థానిక టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి కార్యాలయంలో శ్రీ కృష్ణాష్టమి సంబరాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని ప్రతిమను అందమైన పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయ్యప్ప స్వామి ఆలయ అర్చకులు రాఘవేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు....