GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:41 am Posted by : GARUDA DHATRI NEWS

ఘనంగా శ్రీ వేదనారాయణ స్వామివారి ఉయ్యాల సేవ

ఘనంగా శ్రీ వేదనారాయణ స్వామివారి ఉయ్యాల సేవ
-భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

గరుడధాత్రి న్యూస్ :
నాగలాపురం మండల కేంద్రంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి ఘనంగా ఉయ్యాల సేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలతో మారుమోగింది.
వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు సేవా కార్యక్రమాలను పర్యవేక్షించారు.