ఘనంగా శ్రీ వేదనారాయణ స్వామివారి ఉయ్యాల సేవ

ఘనంగా శ్రీ వేదనారాయణ స్వామివారి ఉయ్యాల సేవ -భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు గరుడధాత్రి న్యూస్ : నాగలాపురం మండల కేంద్రంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి ఘనంగా ఉయ్యాల సేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలతో మారుమోగింది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు సేవా కార్యక్రమాలను పర్యవేక్షించారు.