GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:39 am Digital Edition : GURU SWAMY

ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’.. నెలరోజుల పాటు స్వచ్ఛతా కార్యక్రమాలు

పలమనేరు, సెప్టెంబర్ 18 ( గరుడ ధాత్రి ) :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ మరియు ‘స్వచ్ఛతా హీ సేవా-2026’ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి మార్గదర్శకత్వంలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ తెలిపారు. ఈ నెల రోజుల వ్యవధిలో పట్టణవ్యాప్తంగా వివిధ ప్రజాహిత సేవా కార్యక్రమాలు, పరిసరాల పరిశుభ్రత , సిటియూ ట్రాన్స్‌ఫర్మేషన్, మార్కెట్లు, మరియు అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ అభియాన్‌లో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పలమనేరులో ‘స్వచ్ఛ పాఠశాల” కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు సచివాలయ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాఠశాల, కళాశాల ఆవరణలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరుచేసే విధానం పైనా, విద్యార్థులు పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత పైనా అధికారులు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మికులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.