ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’.. నెలరోజుల పాటు స్వచ్ఛతా కార్యక్రమాలు
పలమనేరు, సెప్టెంబర్ 18 ( గరుడ ధాత్రి ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో 'సేవా సంకల్ప్ అభియాన్' మరియు 'స్వచ్ఛతా హీ సేవా-2026' కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి మార్గదర్శకత్వంలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ తెలిపారు. ఈ నెల రోజుల వ్యవధిలో పట్టణవ్యాప్తంగా వివిధ ప్రజాహిత సేవా కార్యక్రమాలు, పరిసరాల పరిశుభ్రత , సిటియూ ట్రాన్స్‌ఫర్మేషన్, మార్కెట్లు, మరియు...