చంద్రబాబుతో జేపీ నడ్డా ముచ్చట్లు- సెల్ఫీ ఆకర్షణ
కుప్పం,సెప్టెంబర్ 12 (గరుడ ధాత్రి న్యూస్):విజయవాడలో జరిగిన వైద్యారోగ్య అభివృద్ధి కార్యక్రమ వేదికపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ముచ్చటిస్తూ సెల్ఫీ దిగడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, ఉమ్మడి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధిలో సీఎం చంద్రబాబు పోషించిన పాత్ర ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. "కిచెనే ఫార్మసీ-ఆహారమే ఔషధం" అని చంద్రబాబు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదే మూలసూత్రమని గుర్తుచేశారు. కూటమి...