GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 7:22 pm Digital Edition : GURU SWAMY

చంద్రబాబును గుండెల్లో ఉంచుకుందాం- ఏకగ్రీవంగా గెలిపించుకుందాం

* పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న చంద్రబాబు నాయుడు.
* పేదల ఇళ్లపై ఉచితంగా సోలార్ విద్యుత్ సౌకర్యం.
* స్థానిక ఎన్నికల్లో బాబు బలపరిచిన వారిని ఏకగ్రీవంగా గెలిపించుకుందాం.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్.
* కుప్పంలో పేదలకు ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.
* కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యంత్రాంగం.
* సొంత ఇల్లు, స్థలం లేని పేదల కోసం త్వరలో 30 ఎకరాల సేకరణ.
* కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు.
* సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి.
* మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ డి. సుధీర్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 ( ఆర్. శ్రీనివాసులు, గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గుండెల్లో ఉంచుకుందామని, శాసనసభ్యునిగా ఏకగ్రీవంగా గెలిపించుకుందామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జ్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఆదివారం కుప్పం పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో కమిషనర్ వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పేదలకు ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. కుప్పం నియోజకవర్గాన్ని ఆన్ని రంగాలలోనూ సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడుకు ఓటు వేయని కుటుంబాలకు కూడా మంచి జరగాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. కుప్పంలో ఎవరికి ఇల్లు లేదన్న సమస్య ఉండకూడదని అందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తున్నారు అన్నారు. ఇల్లు మంజూరు తో పాటు పూర్తయిన గృహాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. సోలార్ విద్యుత్ కోసం 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని 40 శాతం లబ్ధిదారులు భరించాలని అయితే 40 శాతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెల్లిస్తున్నారని ఫలితంగా కుప్పం నియోజకవర్గం లో లబ్ధిదారునికి ఉచితంగా సోలార్ విద్యుత్ సౌకర్యం లభించనుందన్నారు. ఈ పథకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబు నాయుడు బలపరిచే చైర్మన్ మరియు కౌన్సిలర్లను ప్రజలు ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మనకు మంచి చేస్తున్న చంద్రబాబు నాయుడు కు అడుగడుగునా అండగా ఉండాలని ఆయన కోరారు. కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, 189 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు మంజూర అయిందన్నారు. లబ్ధిదారులకు నాలుగు దశల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. సొంత ఇల్లు గాని, సొంత ఇంటి స్థలం గాని లేని పేదల కోసం 30 ఎకరాల స్థల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఇల్లు మంజూరు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. మదనపల్లిలో ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల తో హార్టికల్చర్ హబ్,అగ్రికల్చర్ యూనివర్సిటీలకు శంకుస్థాపన చేశారని వివరించారు. కుప్పంలో ప్రశాంతంగా బ్రతికేందుకు మనసు ఉంటే చాలని,అందరూ ఆ దిశలో మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు. కుప్పం మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ డి. సుధీర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో అన్ని రంగాలలోనూ రాష్ట్రం అభివృద్ధి బాట పడుతోందన్నారు. గత పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడు కూడా కేవలం రాజకీయాల కోసం బురదజల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని విమర్శించారు. రానున్న అన్ని ఎన్నికల్లోను ఓటు ద్వారా తమ అభిమానాన్ని ప్రజలు చాటుకోవాలని పిలుపునిచ్చారు. కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ, పేదలకు పక్కాగృహం కల అని అన్నారు. పేద ప్రజల సొంతింటి కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాకారం చేస్తున్నారన్నారు. కుప్పం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సతేంద్ర శేఖర్ మాట్లాడుతూ, కుప్పంలో సొంత ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు అన్నారు. కౌన్సిలర్ సోమశేఖర్ మాట్లాడుతూ, అడుగడుగునా చంద్రబాబు చేసిన అభివృద్ధి కనిపిస్తోందన్నారు. టిటిడి పాలక మండలి సభ్యులు శాంతారామ్ మాట్లాడుతూ, సొంత ఇల్లు అనేది అందరికీ అవసరం అని, బాడుగ ఇండ్లలో ఎన్నో అవస్థలు పడుతున్నారని అటువంటి వారి అవస్థలు తీర్చేందుకు చంద్రబాబు పక్క గృహాలు మంజూరు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో వారికి భద్రత, భరోసా కల్పించేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలో గృహాలు మంజూరు అయిన 189 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సెల్వ రాజు, ఫ్లోర్ లీడర్ దామోదరం నాయుడు, వివిధ హోదాలలోని నాయకులు సోము, కన్నన్, ఆర్. శ్రీనివాసులు, వేణు, అప్పు ముఖేష్, శ్యామ్ సుందర్,ఉదయ్ కుమార్, మంజునాథ్, ఆర్ముగం, జయమ్మ, జాకీర్, రవి,నాగరాజ్, జయరాం నాయుడు,రవి, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘం ఉద్యోగులు, ఇండ్ల మంజూరు లబ్ధిదారులు పాల్గొన్నారు.