GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 7:16 am Posted by : GARUDA DHATRI NEWS

చక్కటి జీవనశైలిని పాటిస్తే బీపీ, షుగర్, థైరాయిడ్ అధిక బరువు వంటివ్యాధులు తగ్గుముఖం ఖాయం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్12

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బైరెడ్డిపల్లి 1 అంగన్వాడి సెంటర్ నందు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సావిత్రి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం కొనసాగింది. యోగా, ద్యానం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ చిన్న వయస్సు నుండి అలవర్చుకోవాలని తెలిపారు. చక్కటి జీవనశైలిని పాటిస్తే బీపీ, షుగర్, థైరాయిడ్ అధిక బరువు వంటి జీవనశైలి జబ్బులు తగ్గుతాయని పేర్కొన్నారు. కాబట్టి ప్రతిరోజు కనీసం 30 నిమిషములు నడక,వ్యాయామం యోగ, ధ్యానంచేయడం వలన ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మలమ్మ, దీప, ఆశాలు ముబీన, భారతి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.