చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిసిన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు
చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిసిన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు నాగలాపురంలో జరుగుతున్న శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగగా భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు,...