చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు

మే 27, 28, 29 తేదీల్లో మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ఇఫ్ కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో చాలా విశాలమైన స్థలంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. 200 ఎకరాలు సభా ప్రాంగణానికి, మరో 300 ఎకరాలు వాహనాల పార్కింగ్ కు సిద్ధమవుతున్నాయి. దశాబ్దాలుగా మహానాడుకు హాజరవుతున్నాం..నాంపల్లి గ్రౌండ్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు కార్యకర్తలతో కలిసి నడిచిపోయిన రోజులు ఇంకా గుర్తున్నాయి. నెల్లూరులో...