చరిత్రాత్మక విజయానికి రెండేళ్లు.. సత్యవేడు టీడీపీ నేతల సంబరాలు
సత్యవేడు, జూన్ 5 గరుడధాత్రి : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయానికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. సత్యవేడు నియోజకవర్గo నాగలాపురం మండల అధ్యక్షులు టి.జె.బి. ప్రణీత్రె రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత,...