చిత్తూరును కరువు జిల్లాగా ప్రకటించాలి : ఏఐకేఎంఎస్ రైతు సంఘం డిమాండ్
పలమనేరు, సెప్టెంబర్ 23 ( గరుడ ధాత్రి ) : ఎల్-నినో ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన చిత్తూరు జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభల పిలుపుమేరకు పలమనేరు మండల కేంద్రంలో తహశీల్దార్‌కు బుధవారం ఆయన ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయంపై ఆధారపడిన రైతులు అప్పులపాలై తీవ్రంగా సతమతమవుతున్నారని...