చిత్తూరు నవంబర్ 1(గరుడ దాత్రి న్యూస్) చిత్తూరులో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగించుకున్నారు. ఉదయం 7:30 నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసిన సమయానికి 78.77 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్. జిల్లా ఎస్పీ తుషార్ డూడి 60 పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.వికలాంగులు వృద్ధులు ఉత్సాహంగా ఓటు వేశారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సమేతంగా 11వ వార్డులో తమ ఓటును వినియోగించుకున్నారు. మేయర్ అభ్యర్థి కటారి హేమలత. మాజీ ఎమ్మెల్యే తమ ఓటును వినియోగించుకున్నారు. ఎంపీ దగ్గు మళ్ల ప్రసాదరావు పోలింగ్ సరళిని పరిశీలించారు