చిత్తూరు అభివృద్ధే మా లక్ష్యం.. విభేదాలకు తావులేదు ఎంపీ దగ్గుమళ్ళ – ఎమ్మెల్యే గురజాల సంయుక్త స్పష్టీకరణ
చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంయుక్తంగా స్పందిస్తూ, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ప్రజా శ్రేయస్సు, చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధే తమ ఏకైక అజెండా అని ఉద్ఘాటించారు. ఆదివారం చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో నెలకొన్న సమస్యను పరిశీలించి, న్యాయం జరిగేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గురజాల జగన్...