గరుడధాత్రి :
జిల్లా కేంద్రంలోని చిత్తూరు రైల్వే స్టేషన్ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈస్ట్ కోస్టల్ పరిధిలోకి చిత్తూరు రైల్వే స్టేషన్ రావడం హర్షణీయమన్నారు.
ఇందుకు సహకరించిన దేశ ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రులకు ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రుల దశాబ్దాల కలకు సాకారం అయిన నేపథ్యంలో సోమవారం నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావించిఃది. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు రైల్వే స్టేషన్ను సందర్శించారు.
రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.., ఇందుకోసం అహర్నిశలు శ్రమించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల చిరకాల కల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అయ్యిందన్నారు. 2019 ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రకటన చేసినా, గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందనీ,. భూములు అప్పగించాలని కేంద్రం ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో
విభజన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగడం, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ తరపున విశాఖ రైల్వే జోనల్ కోసం తన వంతు కృషి చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావును రైల్వే అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.
అలాగే తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరుతూ, తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావుకు వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా రైల్వే కూలీలు, రైల్వే సంఘాల నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు ఎంపీకి వినతులు సమర్పించారు. దీనికి సానుకూలంగా స్పందించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతానని తెలియజేశారు.