చిన్నకొండామర్రిలో లంపిస్కిన్ నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభం
చౌడేపల్లి ఆగస్టు 01 గరుడ దాత్రి న్యూస్ చౌడేపల్లి పరిధిలోని చిన్నకొండమర్రి గ్రామంలో శనివారం పాడిపశువులకు లంపిస్కిన్ (ముద్ద చర్మవ్యాధి) సోకకుండా నివారణ టీకాల కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ (మదనపల్లె) డాక్టర్ శ్రీనివాసులు నాయుడు, డాక్టర్ పవన్ కుమార్(చౌడేపల్లి ) కలిసి అధికారికంగా ప్రారంభించారు. నెల రోజుల పాటు టీకాల పంపిణీ ఈ వ్యాధి నివారణ టీకాల ప్రక్రియను ఈ రోజు నుండి ఆగస్టు 31 వరకు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నారు. ఈ గడువులోగా మొత్తం 13,000 డోసుల...