చిన్నారుల రక్షణకే పోక్సో చట్టం

సత్యవేడు జూన్ 22 గరుడధాత్రి : చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని స్థానిక ఎంఈఓ ఉష తెలిపారు. సోమవారం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఉష మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమలులోకి...