చిన్నూరు చెరువులో అక్రమ తవ్వకాలు
అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ మహిళ పలమనేరు, ఆగస్టు 03 ( గరుడ ధాత్రి ) : పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండల వ్యాప్తంగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై చిన్నూరు గ్రామానికి చెందిన సునీత అనే మహిళ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రకృతి సంపదను దోచుకుంటున్న మట్టి మాఫియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమె గంగవరం తహశీల్దార్ రేఖకు, అలాగే స్థానిక పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.ఈ సందర్భంగా సునీత విలేకరులతో మాట్లాడుతూ.. చిన్నూరు చెరువులో...