GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:56 pm Digital Edition : GURU SWAMY

చిన్న మస్తాన్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

శ్రీ సిటీ అక్టోబర్ 4 గరుడధాత్రి :

శ్రీసిటీ టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో మృతి చెందిన సత్యవేడు మండలం చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్ కుటుంబాన్ని తిరుపతి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరామర్శించారు. మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
తిరుపతి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు బాలగురువం బాబు, కేకేసీ చైర్మన్ బాలగురువం చిరంజీవి, సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డి.కిరణ్ కుమార్ చిన్న మస్తాన్ మృతదేహాన్ని సందర్శించారు. వారి వెంట కేకేసీ జనరల్ సెక్రటరీ బి.గురవయ్య, సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యదర్శి బొగ్గుల సురేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా బాలగురువం బాబు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.